రూపాయి జీవనకాల కనిష్ఠానికి
ముంబై, 12 మే (హి.స.) మార్కెట్లు మరో రోజు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి (Stock Maket Today). పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ముగింపుపై అనిశ్చితి నెలకొనడంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దాంతో రూపాయి జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్ర
BSE NSE


ముంబై, 12 మే (హి.స.) మార్కెట్లు మరో రోజు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి (Stock Maket Today). పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ముగింపుపై అనిశ్చితి నెలకొనడంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దాంతో రూపాయి జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఉదయం 9.37 గంటల సమయంలో సెన్సెక్స్ 656 పాయింట్లు కోల్పోయి, 75,369 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 171 పాయింట్లు క్షీణించి, 23,641 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీలో ఓఎన్జీసీ, హిందాల్కో, భారతీ ఎయిర్టెల్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ఉండగా.. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సీఎల్ షేర్లు నష్టపోతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత పతనమైంది. జీవనకాల కనిష్ఠానికి చేరి, 95.63గా నమోదైంది.

ఐటీ స్టాక్స్ భారీగా పడిపోయాయి. మదుపర్లు అమ్మకాలకు దిగడంతో ఇన్ఫోసిస్, టీసీఎస్ సంస్థల షేర్లు మూడు శాతం పతనమయ్యాయి. ఇక వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో మదుపర్ల సంపద రూ.11 లక్షల కోట్లు మేర ఆవిరైంది.

ఒక్క సోమవారమే ఆ మొత్తం రూ.6 లక్షల కోట్లని తెలుస్తోంది. బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, ఇంధనాన్ని పొదుపుగా వాడాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం, చమురు మంటలు ఆందోళన కలిగిస్తున్నాయి.

8

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande