
అనంతపురం, 12 మే (హి.స.)అనంతపురం జిల్లా సింగనమల చీని రైతులు కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు.
అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గ చీని రైతుల సమస్యలపై నేడు రైతు సంఘం నాయకులు సమరశంఖం పూరించారు. అకాల వర్షాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మరియు చీడపీడల వల్ల తీవ్రంగా నష్టపోయిన చీని రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు.
సింగనమల నియోజకవర్గం చీని రైతులు మరియు రైతు సంఘం రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.
రైతు సంఘం నాయకులు
సింగనమల ప్రాంతంలో చీని తోటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతున్నారు. పెట్టుబడి కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రైతులకు దిగుబడి తగ్గిన రైతులకు ఎకరాకు కనీసం ₹50,000 నష్టపరిహారం అందించాలి. గిట్టుబాటు ధర మార్కెట్లో దళారుల దోపిడీని అరికట్టి, చీని కాయలకు మద్దతు ధర ప్రకటించాలి.
కోల్డ్ స్టోరేజ్ సింగనమల ప్రాంతంలో చీని రైతుల కోసం ప్రత్యేక శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలి.రైతులకు రాయితీలు డ్రిప్ ఇరిగేషన్ మరియు ఎరువులపై 90% రాయితీ కల్పించాలి.కలెక్టరేట్ గేటు వద్ద రైతులు బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రైతు సంఘం నాయకులకు సర్దు చెప్పటంతో ధర్నా విరమించారు జిల్లా యంత్రాంగం స్పందించి తమను ఆదుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV