మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడి.. పరారీలో ఎస్సై
హైదరాబాద్, 13 మే (హి.స.) మహిళా కానిస్టేబుల్ కి మాయ మాటలు చెప్పి ఆమె పై లైంగిక దాడికి పాల్పడిన ఎస్సై పై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కేసు నమోదు అయిందని తెలుసుకున్న ఎస్సై ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటన సైబరాబాద్ పోల
Si


హైదరాబాద్, 13 మే (హి.స.)

మహిళా కానిస్టేబుల్ కి మాయ మాటలు చెప్పి ఆమె పై లైంగిక దాడికి పాల్పడిన ఎస్సై పై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కేసు నమోదు అయిందని తెలుసుకున్న ఎస్సై ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనంగా మారింది. శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా పని చేస్తున్న 2018 బ్యాచ్ కి చెందిన ఎస్సై సురేష్ కుమార్ కి కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పని చేస్తున్న లేడీ కానిస్టేబుల్ తో ఫ్రెండ్ షిప్ పెరిగింది. ఈ ఫ్రెండ్ షిప్ వారిని సన్నిహితంగా ఉండేలా చేసింది. ఎస్సై ఆమెకు మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.

మహిళా కానిస్టేబుల్ కి చెప్పిన మోసపూరిత మాటలను నెరవేర్చమని అడగడంతో ఎస్సై రివర్స్ అయ్యాడు. ఈ నేపథ్యంలో మహిళా కానిస్టేబుల్ ఎస్సై పై తనను మోసం చేసి లైంగికంగా దాడి చేశాడని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. పోలీస్ అధికారులు క్రిమినల్ కేసును నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు. కేసు నమోదు చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్సై పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాదాపు నెలన్నర కిందట నమోదైన కేసులో ఎస్సై సురేష్ కుమార్ ఆచూకి లభించలేదని తెలిపారు. ఎస్సై సురేష్ కుమార్ పై లైంగిక దాడి కేసు నమోదు అయిందని తెలియగానే ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande