
కుప్పం, 13 మే (హి.స.)
కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఏపీ సీఎం రానున్నారు. ఈ నెల 20న సీఎం చంద్రబాబు దంపతులు గంగమ్మ తల్లిని దర్శించుకోనున్నారు. జాతరలో భాగంగా విశ్వరూప దర్శనానికి సీఎం దంపతులు హాజరు కానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం దంపతులు ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు.
తిరుపతి గంగమ్మ జాతరకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున . భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు తాగునీరు, పారిశుధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV