పారిశుధ్యం పై మున్సిపల్ కమిషనర్ స్పెషల్ ఫోకస్.. హోటల్ టిఫిన్ సెంటర్ల ఆకస్మిక తనిఖీ
పారిశుధ్యం పై మున్సిపల్ కమిషనర్ స్పెషల్ ఫోకస్.. హోటల్ టిఫిన్ సెంటర్ల ఆకస్మిక తనిఖీ
మున్సిపల్


సంగారెడ్డి, 13 మే (హి.స.)

పట్టణంలో పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఇకపై ఊరుకునేది లేదని సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు. బుధవారం మార్నింగ్ శానిటేషన్ తనిఖీల్లో భాగంగా ఆకస్మికంగా రంగంలోకి దిగిన కమిషనర్, రోడ్డుపై చెత్త వేసిన వారితోనే ఆ చెత్తను తీయించిహెచ్చరికలు జారీ చేశారు. ఐబీ వద్ద రోడ్డుపై చెత్త వేసిన హోటల్ యజమానితో దగ్గరుండి చెత్తను తీయించారు. అనంతరం జనప్రియ హోటల్, చార్మినార్ హోటల్, మానస హాస్పిటల్ వద్ద బిందు టిఫిన్ సెంటర్లను తనిఖీ చేశారు. నాణ్యమైన వంట నూనెను వాడాలని, ప్లాస్టిక్ కవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని నిర్వాహకులకు స్పష్టం చేశారు. హోటళ్లు, పాన్ షాపులు, టీ షాపులు, రోడ్డుపై చెత్త వేస్తున్న అన్ని షాపుల యజమానులతో దగ్గరుండి చెత్తను తీయించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మెయిన్ రోడ్డుపై హోటళ్లు, షాపుల ముందు చెత్త వేయడం వల్ల గాలికి రోడ్డు మీదకు వచ్చి పారిశుధ్య నిర్వహణకు తీవ్ర ఇబ్బందిగా మారుతోందని అన్నారు. పట్టణ ప్రజలు చెత్తను బయట వేయకుండా తడి, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ స్వచ్ఛ ఆటోలకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వాడకం ప్రపంచానికి పెనుభూతం గా తయారైంది. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లేటప్పుడు బట్ట సంచి మాత్రమే తీసుకెళ్లాలి” అని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande