సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు:రామగుండం ఎమ్మెల్యే
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు:రామగుండం ఎమ్మెల్యే
MLA


గోదావరిఖని, 13 మే (హి.స.)

ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని, అధికారులు అలసత్వం చేస్తే అసలు సహించబోమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ హెచ్చరించారు. బుధవారం గోదావరిఖని నగరంలోని 51వ డివిజన్లో నెలకొన్న డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలపై స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తెలుసుకొని ఆయన మాట్లాడారు. వార్డులో స్వయంగా పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. కాలనీలో పేరుకుపోయిన మురుగునీరు, చెత్త సమస్యలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులను ప్రశ్నిస్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం అసలు సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande