నెల్లూరులో హైటెన్షన్.. కూల్చేసిన చోటే బీజేపీ ఆఫీస్ రీ-కన్స్ట్రక్షన్!
నెల్లూరులో హైటెన్షన్.. కూల్చేసిన చోటే బీజేపీ ఆఫీస్ రీ-కన్స్ట్రక్షన్!
nellore-kisan-center-bjp-office-reconstruction-1


నెల్లూరు , 13 మే (హి.స.)

నెల్లూరు నగరంలోని కిసాన్ సెంటర్ వద్ద బిజెపి కార్యాలయం పునః నిర్మాణ క్రమయం కార్యక్రమం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితిలు నెలకొన్నాయి.. అక్కడ ఉన్న బిజెపి కార్యాలయాన్ని గత నెలలో మున్సిపల్ శాఖ అధికారులు తొలగించారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బిజెపి ఇవాళ అదే ప్రాంతంలో తిరిగి కార్యాలయాన్ని పుననిర్మించేందుకు సిద్ధమైంది.. దీంతో ఒకవైపు మున్సిపల్ అధికారులు, మరోవైపు పోలీసులు, ఇంకోవైపు పెద్ద ఎత్తున తరలివచ్చిన బిజెపి నాయకులు, కార్యకర్తలతో ఆ ప్రాంతం... టెన్షన్ వాతావరణం నెలకొంది. బిజెపి కార్యాలయం పుణ్యమా అని మున్సిపల్ అధికారులు అడ్డు చెప్పడంతో అక్కడ చేరుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, సీనియర్ నేత ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి.. అక్కడ నుంచి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నందన్ లతో ఫోన్లో మాట్లాడారు.

తమ కార్యాలయం ఉన్న ప్రాంతంలోనే తిరిగి పునర్నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ అధికారులు అడ్డు చెప్పడంతో బిజెపి కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ ఉన్నతాధికారులు మంత్రి నారాయణ సర్దుబాటు చేయడంతో బిజెపి నాయకులు అదే ప్రాంతంలో తమ కార్యాలయం పునర్నిర్మాణం చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande