రేణిగుంట టు అగర్తల.. రైల్వే సరికొత్త స్కెచ్! వ్యాపారులకు ఇక పండగే!
రేణిగుంట టు అగర్తల.. రైల్వే సరికొత్త స్కెచ్! వ్యాపారులకు ఇక పండగే!
renigunta-to-agartala-parcel-cargo-express-launched-149597


రేణిగుంట , 13 మే (హి.స.)

దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ మనోజ్ డీసీఎం నాగరాజాన్ మనోజ్ మార్గదర్శకత్వంలో రేణిగుంట నుంచి అగర్తల వరకు పార్సెల్ కార్గో ఎక్స్ప్రెస్ ఇనాగురల్ స్పెషల్ రైలును ప్రారంభించారు.

ఈ ప్రత్యేక కార్గో రైలు ద్వారా దేశంలోని దూర ప్రాంతాలకు పార్సెల్ సరుకులను వేగవంతంగా, సురక్షితంగా రవాణా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్గో ఎక్స్ప్రెస్ ద్వారా రైల్వేకు దాదాపు 54 కోట్ల ఆదాయం లభించే అవకాశముందని పేర్కొన్నారు.

రేణిగుంట నుంచి ప్రారంభమైన ఈ రైలు మార్గమధ్యంలో హైదరాబాద్, హౌరా ప్రాంతాల్లో లోడింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం ద్వారా వ్యాపారులకు మరింత సౌకర్యం కల్పించారు.ఈ కొత్త సేవలతో పార్సెల్ రవాణా రంగానికి ఊతం లభించడంతో పాటు దక్షిణ భారతదేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు సరుకు రవాణా మరింత సులభతరం కానుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande