రీల్స్ పిచ్చితో పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న ఇంటర్ విద్యార్థి
రీల్స్ పిచ్చితో పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న ఇంటర్ విద్యార్థి
రీల్స్ పిచ్చితో పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న ఇంటర్ విద్యార్థి

కొత్తచెరువు, 02 మే (హి.స.), రీల్స్ పిచ్చితో ఇంటర్ విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతుకుంటలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన అంజనేయులు కుమారుడు శివకుమార్ ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. గ్రామంలోని పాత సచివాలయం వద్ద స్నేహితులతో కలిసి రీల్స్ చేశాడు. ఈ క్రమంలో శివకుమార్ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు ఎక్కువ కావడంతో అతని స్నేహితులు చొక్కాను లాగేశారు. అప్పటికే శివకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande