వాణిజ్య గాస్ ధరలు భారీగా పెరిగినందున స్టార్ హోటల్ మెనూ ధరలు 10% పెంపు
వాణిజ్య గాస్ ధరలు భారీగా పెరిగినందున స్టార్ హోటల్ మెనూ ధరలు 10% పెంపు
వాణిజ్య గాస్ ధరలు భారీగా పెరిగినందున స్టార్ హోటల్ మెనూ ధరలు 10% పెంపు

అమరావతి, 02 మే (హి.స.)వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగినందున స్టార్ హోటళ్లలో మెనూ ధరలు 10% పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వాణిజ్య సిలిండర్ ధర ఒకేసారి రూ.993 పెంచడంతో హోటళ్ల రంగం కుదేలవుతుందన్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చుల వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడేందుకు, హోటల్ రంగాన్ని నిలబెట్టుకునేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande