తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుమల


తిరుమల, 02 మే (హి.స.) శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. ఎలాంటి టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం చేసుకోవడానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో క్యూలైన్లు బాట గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి.

ఇదిలా ఉండగా.. నిన్న ఒక్కరోజే 71,008 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 36,144 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్నటి శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.52 కోట్లుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande