'ఏ క్షణమైనా పేలవచ్చు'.. శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు కలకలం
'ఏ క్షణమైనా పేలవచ్చు'.. శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు కలకలం
Bomb


హైదరాబాద్, 24 మే (హి.స.)

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ఆమ్స్టర్ డామ్ నుంచి హైదరాబాద్కు వస్తున్న 'KLM-873' నెంబర్ గల విమానంలో బాంబు ఉన్నట్లు, అది ల్యాండ్ అయ్యే లోపు ఏ క్షణమైనా పేలవచ్చంటూ ఓ అగంతకుడు ఎయిర్పోర్ట్ అధికారులకు ఈ-మెయిల్ పంపాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానాన్ని ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేయించారు.

ముందు జాగ్రత్తగా ప్రయాణికులందరినీ కిందకు దించి ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. అనంతరం భద్రతా దళాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, అందులో ఎలాంటి బాంబు లేదని నిర్ధారించాయి. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నకిలీ బాంబు బెదిరింపు మెయిల్పై విమానాశ్రయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande