కాంగ్రెస్కు వెలుగులు వస్తే సమాజానికి చీకటే.. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కాంగ్రెస్కు వెలుగులు వస్తే సమాజానికి చీకటే.. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కాంగ్రెస్కు వెలుగులు వస్తే సమాజానికి చీకటే.. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్


రామగిరి, 25 మే (హి.స.)

కాంగ్రెస్ పార్టీ తన నిజస్వరూపాన్ని ఏనాడు విస్మరించలేదని, ఆ పార్టీకి ఎప్పుడూ వెలుగులు వస్తే అప్పుడు సమాజానికి చీకటే అలుముకుంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సింగరేణి ఆర్జీ-3 డివిజన్ ఓసీపీ-2 గేట్ సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. పదేండ్ల పాటు సింగరేణి సంస్థను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఇటు సింగరేణికి, అటు ప్రజలకు రక్షణ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 420 హమీలు, ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు 250గజాల స్థలం, రూ.20లక్షల ఇస్తామని చెప్పి మోసం చేసిందని, ఈ ప్రాంతంలో ఎవరికైనా ఒక్కరికి స్థలం, పైసలు ఇచ్చిండ్లా అని ఆయన ప్రశ్నించారు.

రెండేళ్ల కాలంలోనే కాంగ్రెస్ నిజస్వరూపం తెలిసి అనేక మంది బయటకు వస్తున్నారని, ముందుగానే గ్రహించిన జీవన్రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ ఆకునూరి మురళీ లాంటి కాంగ్రెస్ను వీడారని ఆయన గుర్తు చేశారు. కమ్యూనిస్టు ఆలోచనలు ఉన్నవారు ఇప్పటికైనా బయటకు రావాల్సిన అవసరముందని అన్నారు. ఎన్నికలు వస్తే మొసలి కన్నీళ్లతో మన ముందుకు వచ్చి మళ్లీ మోసం చేసే ప్రమాదం ఉందని ఆయన గుర్తు చేశారు. సింగరేణి ఓసీపీ-2లో ఎక్కడెక్కరి వారో వచ్చి పని చేసేవారని, కానీ ఈనాడు పరిసర ప్రాంతాల వారు ఇక్కడ కార్మికులుగా పని చేస్తున్నారని చెప్పారు. అలాగే వ్యవసాయ రైతులుగా ఉన్నారని, వీరంతా ప్రభుత్వ పనితీరుతో ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్తం అవుతుందన్నారు. ఇటు కార్మికులను, అటు కర్షకుల పరిస్థితులు ఈనాడు మనకు కల్లకు కట్టినట్లు కన్పిస్తుందన్నారు. ఆనాడు గొప్ప గొప్ప మాటలు చెప్పితే వాళ్ల నోటికి మొక్కాలని కేసీఆర్ అన్నారని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande