గాంధీ భవన్లో గొడవ.. మల్లురవితో కార్పొరేటర్ల వాగ్వాదం
గాంధీ భవన్లో గొడవ.. మల్లురవితో కార్పొరేటర్ల వాగ్వాదం
Gandhi Bhavan


హైదరాబాద్, 24 మే (హి.స.)

అధికార కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఆఫీస్ గాంధీ భవన్లో (Gandhi Bhavan) గొడవ కలకలం రేపింది. ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్ కార్యకర్తల సమావేశంలో రచ్చ జరిగింది. గోషామహల్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే సునీతా రావు లేకుండా ఎలా సమీక్ష నిర్వహిస్తారని కార్పొరేటర్లు, నేతలు హైదరాబాద్ పార్లమెంటరీ పార్టీ ఇంచార్జి మల్లు రవిని నిలదీశారు. దీంతో సమస్యలు ఉంటే చెప్పాలని అనవసరంగా అరిచి గొడవ చేయొద్దని మల్లురవి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వైపుల మాటా మాటా పెరిగి టెన్షన్ వాతావరణం నెలకొంది.

కార్యకర్తల తీరుపై మండిపడ్డ మల్లురవి తాను కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడిని అని, తన ముందే ఇలా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు. కాగా హైదరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ మల్లురవి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో బూత్ లెవల్ ఏజెంట్ల పనితీరుపై రిపోర్టు తీసుకునేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande