గీత కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలి..కొప్పుల ఈశ్వర్
గీత కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలి.. కొప్పుల ఈశ్వర్
గీత కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలి..కొప్పుల ఈశ్వర్


ధర్మారం, 24 మే (హి.స.)

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో తాటి వనాలు కాలిపోయిన నేపథ్యంలో గీత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. శనివారం ధర్మారం శివారులోని సలాంద్రి సమీపాన ఉన్న తాటి వనాలు అగ్ని ప్రమాదంలో ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న ఈశ్వర్ ఆదివారం కాలిన తాటి వనాలను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 ఎకరాలలోని తాటివనాలు అగ్ని ప్రమాదంలో కాలిపోవడం బాధాకరమన్నారు.

తాటి వనాలు కాలిపోవడంతోస్థానిక గీత కార్మికులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు తగిన పరిహారం అందజేసి కాలిపోయిన తాటి వనాల స్థానంలో కొత్త వనాలను పెంచాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గీత కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉందని మాజీ సీఎం కేసీఆర్ 5 కోట్ల తాటివనాలను పెంచారని ఈశ్వర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande