అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
MLA


జమ్మికుంట, 24 మే (హి.స.)

జమ్మికుంట మండలం మడిపల్లి

గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఈత వనం, తాటి వనం పూర్తిగా దగ్ధమై గౌడ సోదరులు తీవ్రంగా నష్టపోయిన ఘటనపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో మాట్లాడిన ఎమ్మెల్యే, జరిగిన నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం కారణంగా జీవనాధారం కోల్పోయిన గౌడ కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు.

బాధితులకు తక్షణ నష్టపరిహారం అందించాలంటూ జిల్లా కలెక్టర్తో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. అలాగే ఎక్సైజ్ సీఐతో కూడా మాట్లాడి సంబంధిత శాఖల ద్వారా బాధిత కుటుంబాలకు వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి గౌడ సోదరులకు తగిన ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande