
తిరుమల, 24 మే (హి.స.)
: అనాథ రక్షకుడు, ఆపద్భాందవుడు కొలువుదీరిన తిరుమల( Tirumala ) వేంకటేశ్వరస్వామికి దాతల విరాళాలు( Donations ) కొనసాగుతున్నాయి. గుంటూరుకు చెందిన మాదాల శేషగిరిరావు ( Shesagiri Rao ) అనే భక్తుడు ఆదివారం టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ( Anna Prasadam Trust ) ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు.
అదేవిధంగా అదే జిల్లాకు చెందిన వడ్లమూడి మిత్రేష్ అనే భక్తుడు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,111 విరాళంగా అందించారు.ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవోశ్రీ లోకనాథంకు విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi