
హైదరాబాద్, 24 మే (హి.స.)
తెలంగాణలోని పలు జిల్లాల్లో
రాబోయే రెండు రోజులలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD) హెచ్చరించింది. ముఖ్యంగా మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట్, గద్వాల, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వాన పడేందుకు ఛాన్స్ ఉన్నట్టు వాతావరణం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాల సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంటూ, ఆయా అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. జిల్లాలకు
ఇప్పటికే శనివారం రాత్రి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసి వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించగా, తాజాగా వాతావరణ కేంద్రం చేసిన ఈ ప్రకటనతో రానున్న కాసేపట్లో మరికొన్ని జిల్లాల్లో వాతావరణం చల్లబడనుంది. ఈదురు గాలులు. ఉరుముల తీవ్రత దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..