సరిహద్దుల్లో అక్రమ రవాణాను అరికట్టాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
సరిహద్దుల్లో అక్రమ రవాణాను అరికట్టాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
సరిహద్దుల్లో అక్రమ రవాణాను అరికట్టాలి : ఎస్పీ అఖిల్ మహాజన్


నార్నూర్ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. చెక్ పోస్ట్ వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి వాహనాన్ని పరిశీలించాలని సూచించారు. పశువులు తరలకుండా పర్యవేక్షించాలన్నారు. సరైన పత్రాలు లేకుండా పశువుల తరలింపునకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విధులలో నిజాయితీ, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. మహారాష్ట్ర సరిహద్దు గుండా పశువులు, రాయితీ బియ్యం, గుడుంబా, గంజాయి తరలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మాదకద్రవ్యాల నిర్మూలన, అనర్థాలపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. గాదిగూడ ప్రాంత యువత, విద్యార్థులకు గ్రంథాలయ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పెన్నులు, వాలీబాల్ కిట్స్ లను పంపిణీ చేశారు, 24 మే (హి.స.)

: మహారాష్ట్ర సరిహద్దు ( Borders ) ప్రాంతాలలో అక్రమ రవాణాలను అరికట్టాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan ) పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని గాదిగూడ మండలంలో లోకారి చెక్పోస్ట్ నుఆదివారం పరిశీలించారు. గాదిగూడ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. మారేగావ్, హీరాపూర్, పరుసువాడ, గౌరీ, కొలామా గ్రామాలను సందర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande