గోదావరి. పుష్కరాల.ఏర్పాట్లపై.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.ప్రత్యేక దృష్టి
గోదావరి. పుష్కరాల.ఏర్పాట్లపై.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.ప్రత్యేక దృష్టి
గోదావరి. పుష్కరాల.ఏర్పాట్లపై.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.ప్రత్యేక దృష్టి


రాజమండ్రి, :, 25 మే (హి.స.)

గోదావరి పుష్కరాల-2027bఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో పుష్కరాల ఏర్పాట్లపై రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు (సోమవారం) కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పనులు ఎలా జరుగుతున్నాయని అధికారులను అడిగి డిప్యూటీ సీఎం తెలుసుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, అందుకు తగిన విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.

నాణ్యతతో పనులు చేయాలి..

ఈ సమావేశంలో అధికారుల పనితీరుపై డిప్యూటీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాది వ్యవధిలో రూ.8,600 కోట్లతో చేపట్టాల్సిన పనులకు ఇంకా డీపీఆర్లు ఎందుకు సిద్ధం కాలేదని ప్రశ్నించారు. ఒకే సంవత్సరంలో 7 వేల పనులను ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. ముఖ్యంగా పుష్కరాల నిర్వహణలో టూరిజం శాఖ నుంచి సరైన సన్నద్ధత ఎందుకు కనిపించడం లేదని మందలించారు. ఇష్టానుసారంగా ఖర్చు పెడదామని అనుకుంటే కేంద్రప్రభుత్వం నిధులు ఇవ్వదని స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా, నాణ్యతతో పనులు చేయాలని దిశానిర్దేశం చేశారు. హడావిడిగా పాచిపోయిన సిమెంట్తో పనులు చేస్తే అవి కూలిపోతాయని హెచ్చరించారు. గత పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట వంటి ఘటనలు మళ్లీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

భక్తులకు సమాన సౌకర్యాలు కల్పించాలి..

గోదావరి పుష్కరాలు అంటే కేవలం రాజమండ్రికే పరిమితం కాదని, 6 జిల్లాల్లోని 274 పంచాయతీల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. అన్ని ప్రాంతాల్లో భక్తులకు సమాన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పుష్కరాల పనుల సన్నద్ధతపై రాష్ట్ర కేబినెట్లో చర్చిస్తామని వెల్లడించారు. కేంద్ర నిధుల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్దకు వెళ్లే సమయంలో అన్నివిధాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. గోదావరి నదిలో భక్తులు మురికినీళ్లలో స్నానం చేయడం సరికాదని పేర్కొన్నారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గోదావరి పుష్కరాలను విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande