పిల్లల చదువులకు ఆర్థిక భరోసా
పిల్లల చదువులకు ఆర్థిక భరోసా
పిల్లల చదువులకు ఆర్థిక భరోసా


అనంతగిరి, 29 మే (హి.స.)

అనంతగిరి గ్రామీణం, : పిల్లల చదువులకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం తల్లిదండ్రుల్లో ఆశలు నింపుతోంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదును జమచేసే ఈ పథకాన్ని పొందాలంటే ఆధార్ అనుసంధానం, వివరాలు సరిపోలడం లాంటి అంశాలు కీలకం.

తల్లికి వందనం పథకం ద్వారా లభ్ధి పొందేందుకు తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబరు అనుసంధానం తప్పనిసరి. ఆధార్తో ఫోన్ నంబరు లింక్ అవకపోవడంతో గత ఏడాది కొందరు ఆర్థిక సాయానికి దూరమయ్యారు. మరికొందరు ఎలా అనుసంధానం చేయాలో తెలియకపోవడంతో ఆధార్ కేంద్రాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. తల్లులకు రూ.13 వేలు, పాఠశాల అభివృద్ధికి రూ.2 వేల చొప్పున మొత్తం రూ.15 వేలు జమచేస్తోంది.

2026-27 విద్యా సంవత్సరానికి లబ్ధి పొందనున్న జిల్లాలోని అర్హుల జాబితాలను ఉపాధ్యాయులు సిద్ధం చేస్తున్నారు. దీంతో బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానమైందో లేదో సరిచూసుకోవాలని విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఉపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని చేరవేస్తున్నారు. గతంలో కొంతమంది ఆధార్ అనుసంధానం చేసినా సాంకేతిక లోపాలతో ఖాతాలకు డబ్బులు జమకాలేదు. అలాంటివి ఏవైనా ఉంటే వెంటనే సంబంధిత అధికారిని కలిసి వాటిని సరిచేసుకోవాలని సూచిస్తున్నారు.

బ్యాంకు ఖాతాలనూ పరిశీలించాలి..:పథకానికి అర్హులైనవారు బ్యాంకు ఖాతా ఉన్న శాఖలో సంప్రదించి దాని మనుగడను పరిశీలించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత ఫారాలు తీసుకోని, వాటిని అప్డేట్ చేసుకోవాలి. అవసరమైన ఆధార్ సంఖ్య, బ్యాంకుఖాతా వివరాలు, చరవాణి నంబరుతోపాటు అవసరమైన సమాచారం నమోదు చేయాలి. ఎన్పీసీఐకు ఖాతా అనుసంధానమైన వెంటనే సెల్ఫోన్కి సంక్షిప్త సమాచారం వస్తుంది.

ప్రభుత్వం అర్హుల జాబితా ప్రకటించిన తర్వాత లింకు ఇస్తుంది. సచివాలయం సిబ్బందిని సంప్రదించి ‘మై ఆధార్’ సెక్షన్కు వెళ్లి, ఆధార్ సర్వీసెస్ కింద ‘చెక్ ఆధార్ బ్యాంకు లింకేజీ స్టేటస్’ను ఎంపిక చేసుకోవాలి. ఆధార్ సంఖ్య క్యాప్చా నమోదు చేయాలి. ‘సెండ్ ఓటీపీ’పై క్లిక్ చేస్తే సెల్ఫోన్కు మెసేజ్ వస్తుంది. అది నమోదు చేయగానే స్క్రీన్పై ఆధార్ ఏ బ్యాంకు ఖాతాకు అనుసంధానమైందో తెలుస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande