రాష్ట్రంలోనే అతి శీతల ప్రాంతంగా అల్లూరి జిల్లా.లోని.లంబసింగి
రాష్ట్రంలోనే అతి శీతల ప్రాంతంగా అల్లూరి జిల్లా.లోని.లంబసింగి
రాష్ట్రంలోనే అతి శీతల ప్రాంతంగా అల్లూరి జిల్లా.లోని.లంబసింగి


అమరావతి, 29 మే (హి.స.)

చింతపల్లి, రాష్ట్రంలోనే అతి శీతల ప్రాంతంగా అల్లూరి జిల్లాలోని లంబసింగి, చింతపల్లి ప్రాంతాలకు పేరుంది. మండు వేసవిలో సైతం నిండైన చల్లదనంతో మన్యం ఉంటుంది. కొద్దికాలంగా ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. మైదాన ప్రాంతాలతో సరిసమానంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా మన్యంలో వేసవిలో వడదెబ్బ అనే పరిస్థితి చాలా తక్కువ. అటువంటిది మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఇక్కడ కూడా గిరిజనులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వాతావరణ నిపుణులు ఈ ఏడాది ఎల్నినో, సూపర్ ఎల్నినో వంటి భిన్నమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురవుతాయని ముందుగానే హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవకపోవడం అత్యధిక ఉష్ణోగ్రతలు వంటివి తలెత్తుతాయని వారు ప్రకటిస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్్్స, సంక్షిప్త సందేశాల ద్వారా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

పదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఎక్కువగా వడదెబ్బకు గురవుతారు. పిల్లల శరీరంలో వేడిమి నియంత్రణ వ్యవస్థ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వృద్ధుల్లో రక్తప్రసరణ వేగం తగ్గడం వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు కారణమవుతున్నాయి. ఉపాధి శ్రామికులు వడ దెబ్బకు గురవుతుంటారు. ఎండలు అధికంగా ఉండే ప్రాంతాల్లో అధిక శారీరక శ్రమతో కూడిన పనులకు దూరంగా ఉండాలని, తగినంత మోతాదులో నీరు తాగాలి. పల్చని దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. నలుపురంగు, మందంగా ఉండే దుస్తులు వాడకూడదని, బయటకు వెళ్లేటప్పుడు గొడుగు తీసుకెళ్లాలని చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande