కారులో.అక్రమంగా తరలిస్తున్న 170 ల గంజాయి .స్వాధీనం
కారులో.అక్రమంగా తరలిస్తున్న 170 ల గంజాయి .స్వాధీనం
కారులో.అక్రమంగా తరలిస్తున్న 170 ల గంజాయి .స్వాధీనం


గూడెంకొత్తవీధి, 29 మే (హి.స.)

: అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి పరిధిలో శుక్రవారం కారులో అక్రమంగా తరలిస్తున్న 170 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ సుధాకర్ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘సీలేరు వైపు నుంచి గూడెం కొత్త వీధి మీదుగా మైదాన ప్రాంతానికి కొందరు వ్యక్తులు కారులో గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులకు ముందుగా సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు పాత వీధి పరిసర ప్రాంతాల్లో ప్రధాన రహదారిపై వాహన తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒక కారును ఆపి తనిఖీలు చేయగా.. కారులో 170 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. నిందితులు చిత్తూరుకు చెందిన దామోదరం, రాజానగరానికి చెందిన సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, గూడెం కొత్త వీధికి చెందిన మార్క్ ఎలియాస్ సిద్ధును అదుపులోకి తీసుకున్నాం. వీరి వద్ద నుంచి గంజాయి, కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నాం. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాం’’ అని సీఐ వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.85 లక్షలు ఉంటుందని సీఐ సుధాకర్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande