
వరంగల్, 25 మే (హి.స.)
జనగామ జిల్లా పాలకుర్తి ఇరిగేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డీఈ శ్రీకాంత్ ఏసీబీకి పట్టుబడ్డారు. హన్మకొండ భవానీ నగర్లోని సోమవారం తన ఇంట్లో రూ.50 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారిక పనుల కోసం లంచం తీసుకుంటున్న సమయంలో దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ క్రమంలో ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..