హైదరాబాద్ మెట్రోకు తీపికబురు.. 20 ఏళ్ల టైమ్ లిమిట్తో రూ.13,600 కోట్ల రుణం
హైదరాబాద్ మెట్రోకు తీపికబురు.. 20 ఏళ్ల టైమ్ లిమిట్తో రూ.13,600 కోట్ల రుణం
Metro


Red alert


హైదరాబాద్, 25 మే (హి.స.)

హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో

అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రోకు (Hyderabad Metro Rail) దీర్ఘకాలిక ఆర్థిక బలాన్ని చేకూర్చే కీలక ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం మెట్రోపై ఉన్న రుణ భారాన్ని తగ్గించేందుకు రూ.13,600 కోట్ల భారీ రీఫైనాన్సింగ్ (Refinancing) రుణం మంజూరైంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) తో ఎల్అండ్ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఈ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇవాళ న్యూఢిల్లీలో ఐఆర్ఎఫ్సీ సీఎండీ మనోజ్ కుమార్ దూబే, తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి.

ఈ ఒప్పందంతో హైదరాబాద్ మెట్రోలో ఒక పెద్ద మార్పు చోటుచేసుకోనుంది. ఇప్పటి వరకు లార్సెన్ అండ్ టూబ్రో (L&T) అధీనంలో ఉన్న 'ఎల్అండ్ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్' 100 శాతం యాజమాన్య హక్కులు (Ownership) పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ కానున్నాయి. దీంతో హైదరాబాద్ మెట్రో ఇకపై పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కీలక ప్రజా రవాణా ఆస్తిగా (Public Asset) మారనుంది. ప్రస్తుతం ఉన్న రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు గాను రూ.13,600 కోట్ల నిధులు వినియోగిస్తారు. వీటిని నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్కు వాడనున్నారు. ఈ రుణ సౌకర్యం 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితితో, త్రైమాసిక (Quarterly) చెల్లింపుల పద్ధతిలో లభించనుంది. తద్వారా మెట్రోపై ఉన్న నెలవారీ వడ్డీల భారం భారీగా తగ్గుతుంది.

ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నగర రవాణా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి హైదరాబాద్ ఒక కీలక ఇంజిన్గా ఎదుగుతోంది. మెట్రో కనెక్టివిటీ బలోపేతం కావడం వల్ల నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణికులకు సురక్షితమైన, సుస్థిరమైన ప్రయాణ సౌకర్యాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ఈ మెగా డీల్ సక్సెస్ కావడానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ఐఆర్ఎఫ్సీ, ఎల్అండ్, హెచ్ఎంఆర్ఎల్ బృందాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande