రాష్ట్రంలో వైద్య వ్యవస్థ కుప్పకూలింది: హరీష్ రావు ధ్వజం
రాష్ట్రంలో వైద్య వ్యవస్థ కుప్పకూలింది: హరీష్ రావు ధ్వజం
హరీష్ రావు


హైదరాబాద్, 25 మే (హి.స.) రాష్ట్రంలో వైద్య వ్యవస్థ కుప్ప కూలిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) ధ్వజమెత్తారు. ఇటీవల తాండూరు, భద్రాచలంలో జరిగిన అమానవీయ ఘటనలే ఇందుకు సజీవ సాక్ష్యాలని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. తాండూరు (Tandur) రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి పురిటి నొప్పులతో ఓ నిరుపేద గర్భిణీ ప్రాణాలతో పోరాడుతున్నా, 108 అంబులెన్స్ సకాలంలో స్పందించలేదని ఆరోపించారు. దీంతో ఆమె రైల్వే ప్లాట్ఫాం పైనే ఆడబిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చిందని హరీశ్ రావు అన్నారు.

ఇక భద్రాచలం (Bhadrachalam) ఏరియా ఆసుపత్రిలో మరణించిన నిరుపేద మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వడానికి నిరాకరించారని హరీశ్ రావు అన్నారు. ప్రైవేటు వాహనం మాట్లాడుకునే స్థోమత లేక ఆ కుటుంబం శవాన్ని భుజాలపై మోసుకుంటూ వీధుల గుండా వెళ్లడం ప్రతి ఒక్కరినీ కలిచివేసిందని అన్నారు. 'బతికించేందుకు 108 అంబులెన్సులు ລ້.. చనిపోయాక కడసారి ఇంటికి తీసుకెళ్లేందుకు పరమపద వాహనాలు లేవు.. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే ఇందనమ్మ పాలన?' అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన 'అమ్మఒడి', 'హర్స్ వెహికల్స్' సేవలను రేవంత్ సర్కార్ మూలనపడేసిందని ఆరోపించారు.

ముగ్గురు రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే భద్రాచలం లాంటి అమానుష ఘటన జరగడం పాలకుల వైఫల్యానికి నిదర్శనమని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. సీఎం, మంత్రులు కేవలం ప్రచారాలకే పరిమితం కాకుండా ప్రజల అసలు బాధలను చూడాలని హితవు పలికారు. భద్రాచలం ఘటనకు కారణమైన ఆసుపత్రి సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా అంబులెన్స్ (Ambulance) సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని బీఆర్ఎస్ తరఫున హరీశ్ రావు డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande