ప్రభుత్వానికి కూల కొట్టడమే తప్ప, నిర్మించడం తెలియదు.. కేటీఆర్
ప్రభుత్వానికి కూల కొట్టడమే తప్ప, నిర్మించడం తెలియదు.. కేటీఆర్
Ktr


హైదరాబాద్, 25 మే (హి.స.)

కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు (Indiramma houses) నిర్మించలేదని, ఒకవేళ నిర్మించినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చాలెంజ్ చేశారు. మేము నిర్మించిన ఆసుపత్రులకే సీఎం రిబ్బన్లు కట్ చేస్తున్నారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలగొట్టడమే తెలుసు నిర్మించడం తెలియదన్నారు. ఇవాళ కూకట్పల్లిలో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ ఓట్ల సవరణ కార్యక్రమంపై కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశ ప్రజలంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని దూరం చేసుకున్నారని, తెలంగాణలో మాత్రం ప్రజలు అధికారం ఇస్తే రెండేళ్లుగా ఆ దరిద్రం మన నెత్తిన కూర్చుందన్నారు పక్కన ఏపీలో కాంగ్రెస్ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నమోదు చేసిన దొంగ ఓట్ల పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతోపాటు ఏ ఒక్కరి ఓటు కూడా పోకుండా పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా ఉండాలని కోరారు. దీనికోసం ప్రతి బూత్ నుంచి తగిన ప్రణాళికతో ముందుకు పోవాలని కోరారు.

తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో 24 గంటల తాగునీటిని (Hyderabad 24 hours water supply) ప్రతి ఇంటికి సరఫరా చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోత, నీటి కోత తీవ్రంగా ఉండేదని, అయితే పట్టుదలతో 24 గంటల నిరంతర కరెంట్ను హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి అందించిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా

గుర్తుచేశారు. అదేవిధంగా తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ నగరంలో ప్రతి ఇంటికి 24 గంటల సురక్షిత తాగునీరు అందిస్తామని తెలిపారు. దగ్గరుండి మరి హైదరాబాద్ నగరానికి 24 గంటల తాగునీటిని అందించేందుకు బాధ్యత నేను తీసుకుంటానన్నారు.

. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కాంగ్రెస్ వల్లనే దెబ్బతిన్నదని, దీనితోని లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు, సెంట్రింగ్ కార్మికులకు ఉపాధి లభించకుండా పోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులతో పాటు సెంట్రింగ్ కార్మికుల కోసం బీమాతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని కేటీఆర్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande