రైస్ మిల్లర్ల పై జూపల్లి ఆగ్రహం.. ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియపై ఆరా
రైస్ మిల్లర్ల పై జూపల్లి ఆగ్రహం.. ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియపై ఆరా
Jupally


నాగర్ కర్నూల్, 25 మే (హి.స.)

రైస్ మిల్లర్ల పై మంత్రి జూపల్లి

కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం శివారులోని రైస్ మిల్లులో రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్లు, చందుబట్ల మండలంలోని శ్రీ వెంకటేశ్వర అగ్రో ఇండస్ట్రీస్లో మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. రైస్ మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. రోజుల తరబడి ధాన్యం అన్లోడ్ చేయకుండా లారీలను నిలిపివేయడంపై మిల్లు యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి జూపల్లి వార్నింగ్ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకు పోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైస్ మిల్లులు, గోదాముల వద్ద ప్రతి లారీ అన్లోడ్ అయ్యేలా పర్యవేక్షించాలని, పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరగకుండా వెంటనే మిల్లులకు తరలించి అన్లోడ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande