
విజయవాడ, 25 మే (హి.స.)
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో తన భార్య కేశినేని జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసిందంటూ వస్తున్న వార్తలపై విజయవాడ టీడీపీ లోక్సభ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్రంగా స్పందించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తన భార్యకు వ్యక్తిగతంగా ఎలాంటి సమన్లు రాలేదని, కేవలం ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు వచ్చిన నోటీసును కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
'ఇశాన్వీ', 'కేశినేని డెవలపర్స్' సంస్థలు కలిసి ఉమ్మడిగా చేసిన ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కు సంబంధించి ఈడీ నుంచి నోటీసు వచ్చిందని చిన్ని తెలిపారు. ఆ సంస్థలో తన భార్య ఒక డైరెక్టర్గా మాత్రమే ఉన్నారని, అందుకే ఆ కంపెనీకి వచ్చిన నోటీసుపై ఈనెల 27వ తేదీన ఈడీ అధికారులకు పూర్తి వివరణ ఇస్తామని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi