ఎపి ముఖ్యమంత్రి.చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విషన్ 2047 పై.సమీక్ష
ఎపి ముఖ్యమంత్రి.చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విషన్ 2047 పై.సమీక్ష
ఎపి ముఖ్యమంత్రి.చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విషన్ 2047 పై.సమీక్ష


అమరావతి, 26 మే (హి.స.)

ఏపీ నారా చంద్రబాబు నాయుడుఈరోజు (మంగళవారం) అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’లో భాగంగా ప్రాథమిక రంగ అభివృద్ధికి సంబంధించిన ఆరు కీలక మిషన్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సీఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖల పనితీరు, భవిష్యత్తు కార్యాచరణపై సీఎం చంద్రబాబు చర్చించారు.

ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నమోదవుతున్న వర్షపాతం పరిస్థితులు, సాగునీటి లభ్యత, రైతులకు విత్తనాల పంపిణీ, పంటల ప్రణాళిక వంటి అంశాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం, ఉత్పాదకత పెంపు, మార్కెటింగ్ సౌకర్యాల విస్తరణ, ఎగుమతుల అవకాశాలపై కూడా సమావేశంలో చర్చించారు. రైతుల ఆదాయం పెంచే దిశగా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని అధికారులు వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande