భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల ప్రయాణాలిప్పుడే
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల ప్రయాణాలిప్పుడే
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల ప్రయాణాలిప్పుడే

విశాఖపట్నం, , 26 మే (హి.స.)

:విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం, ఆపరేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన తేదీ ప్రకటించకపోయినా... విమాన సంస్థలు మాత్రం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. సింగపూర్కు చెందిన స్కూట్ ఎయిర్లైన్స్ తమ విమానాన్ని జూలై 8 నుంచి భోగాపురం నుంచి నడుపుతామని ప్రకటించింది. జూలై 9 నుంచి భువనేశ్వర్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, అహ్మదాబాద్ తదితర నగరాల నుంచి వచ్చే విమానాలు భోగాపురం విమానాశ్రయం నుంచి నడుస్తాయని పేర్కొన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande