ఈ దేవాలయంలో హిజ్రాలే పూజారులు
ఈ దేవాలయంలో హిజ్రాలే పూజారులు
ఈ దేవాలయంలో హిజ్రాలే పూజారులు


విజయనగరం, 26 మే (హి.స.)

హిజ్రాలు అనగానే సమాజంలో చాలా వరకు చిన్నచూపు కనిపిస్తుంది. అందుకు భిన్నంగా విజయనగరంలోని ఈ ఆలయానికి వెళితే వారి భక్తికి, ఆచార వ్యవహారాలకు ఆశ్చర్యం వేయకమానదు. స్థానిక పెద్ద చెరువుగట్టుపై ఉన్న శ్రీవిజయసాగర దుర్గా మల్లేశ్వర ఆలయాన్ని నిర్మించి, అక్కడి అమ్మవారికి పూజలు నిర్వహిస్తోంది హిజ్రాలే మరి. ప్రస్తుతం సుమారు ఇరవై మంది తమ రోజు సంపాదనలో 90 శాతాన్ని ఈ ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నారు. అమ్మవారికి పూజాదికాలపై పండితుల వద్ద శిక్షణ పొంది, 2008 నుంచి వారే అర్చకులుగా మారారు. సాధారణ రోజుల్లో రోజుకు 200 మంది భక్తులు దర్శించుకుంటారు. శుక్రవారం మాత్రం 2 వేల మందికి పైగా వస్తారు. రోజూ రాత్రి 7.30 గంటలకు సుమారు 200-300 మంది అనాథలకు అన్నదానంతో సమాజ సేవ కూడా చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande