పోలీసుల ప్రత్యేక డ్రైవ్.. 120 గ్రాముల గంజాయి గుర్తించిన జాగిలం
పోలీసుల ప్రత్యేక డ్రైవ్.. 120 గ్రాముల గంజాయి గుర్తించిన జాగిలం
Police police


ఆదిలాబాద్, 26 మే (హి.స.)

ఆదిలాబాద్ జిల్లా బోథ్ పోలీస్ స్టేషన్

పరిధిలోని సోనాల మండలం గుట్టపక్క తండా గ్రామంలో మంగళవారం ఉదయం ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్ ఆధ్వర్యంలో బోథ్ సిఐ డి.గురుస్వామి, ఎస్ఐ వి.పురుషోత్తం సమక్షంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వాహనాల తనిఖీలు చేపట్టగా 2 ఆటోలు, 28 ద్విచక్ర వాహనాలు పరిశీలించారు. అందులో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న 4 బైకులు గుర్తించినట్లు తెలిపారు. అదేవిధంగా నార్కోటిక్ జాగిలం రోమా సహాయం తో తనిఖీలు నిర్వహించగా అందులో రాథోడ్ న్యాల్ సింగ్ అనే వ్యక్తి వద్ద నుండి 120 గ్రాముల గంజాయి జాగిలం గుర్తించింది. వెంటనే గంజాయిని స్వాధీనం చేసుకుని బోథ్ పోలీస్ స్టేషన్ లో చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇక ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పెండింగ్ లో ఉన్న 15 వాహనాల చలానాల ద్వారా రూ.16,750 జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం ఇలాంటి కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాహనాలకు సరైన పత్రాలు కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామ ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు,అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande