అనిల్ అంబానీ గ్రూప్ సంస్థపై భారీ ఫ్రాడ్ కేసు నమోదు
అనిల్ అంబానీ గ్రూప్ సంస్థపై భారీ ఫ్రాడ్ కేసు నమోదు
Anil Ambani


ముంబై, 26 మే (హి.స.)

అనిల్ అంబానీ గ్రూప్ సంస్థపై మరో

కేసు నమోదైంది. ముంబై కార్పొరేట్ రంగంలో భారీ లోన్ ఫ్రాడ్ (Massive loan fraud) వెలుగులోకి రాగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (Reliance Home Finance) సంస్థ మాజీ డైరెక్టర్పై ముంబైలోని కుఫ్ పరేడ్ (Cuffe Parade) పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. నకిలీ పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు ఆరోపణలపై యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థ తమ ఆర్థిక పరిస్థితి చాలా పటిష్టంగా ఉందంటూ నకిలీ, తప్పుడు పత్రాలను సృష్టించి యాక్సిస్ బ్యాంక్ నుంచి భారీగా రుణం పొందింది.

అయితే, ఏ అవసరం కోసమైతే ఈ లోన్ తీసుకున్నారో.. నిధులను వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇతర షెల్, అనుబంధ కంపెనీల్లో పెట్టుబడిగా మళ్లించారు. ఈ రకమైన మోసపూరిత విధానాల ద్వారా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ యాజమాన్యం తమ బ్యాంకుకు సుమారు రూ. 150 కోట్ల మేర ఫ్రాడ్ చేసిందని, తీవ్ర ఆర్థిక నష్టాన్ని చేకూర్చిందని యాక్సిస్ బ్యాంక్ ఉన్నతాధికారులు పోలీసులకు వెల్లడించారు. బ్యాంక్ అంతర్గత విచారణలో ఈ దగా బయటపడటంతో, కుఫ్ పరేడ్ పోలీసులు మాజీ డైరెక్టర్తో పాటు పలువురు కీలక అధికారులపై ఐపీసీ / బీఎన్ఎస్ పరిధిలోని ఫోర్జరీ, మోసం కేసుల కింద ఎఫ్ఎఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande