
ముంబై:, 29 మే (హి.స.)
కల్తీ మద్యం సేవించి 12 మంది మరణించారు. అస్వస్థత చెందిన మరి కొందరి వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉన్నది. కల్తీ మద్యానికి సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. (spurious liquor) మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పూణే, పరిసర ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యక్తులు కల్తీ మద్యం తాగారు. తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది మరణించారు. పింప్రి-చించ్వాడ్లోని ఫుగెవాడి ప్రాంతంలో ఏడుగురు, హడప్సర్లోని ససనే నగర్, కాలేపడల్ ప్రాంతానికి చెందిన మరో ఐదుగురు చనిపోయారు. అనారోగ్యం పాలైన మరికొందరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
కాగా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సంఘటనపై స్పందించారు. సమగ్ర విచారణ చేయాలని పూణే, పింప్రి-చించ్వాడ్ పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కల్తీ మద్యం నెట్వర్క్ను అధికారులు గుర్తించారని, దీంతో మరిన్ని అరెస్ట్లు జరిగే అవకాశమున్నదని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi