సీరియస్ గా పోరాటం చేస్తే ముదిరాజ్లదే అధికారం.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
సీరియస్ గా పోరాటం చేస్తే ముదిరాజ్లదే అధికారం.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
MP


హైదరాబాద్, 26 మే (హి.స.)

ముదిరాజ్లకు అధికారంపై

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) కీలక వ్యాక్యలు చేశారు. తెలంగాణలో అతిపెద్ద కులం ముదిరాజ్ అని రాష్ట్రంలో ముదిరాజ్ 7.46 శాతంగా ఉందన్నారు. 35 నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నప్పటికీ రాజకీయంగా ముదిరాజ్లకు తగిన ప్రాధాన్యత లేదని ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచించుకోవాలన్నారు. అంతా ముదిరాజ్లను బిసీ-డీ నుంచి బీసీ-ఏ కు మార్చాలని ప్రధాన డిమాండుతో ఇవాళ ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ జలవిహార్లో ముదిరాజ్ సింహవాలోకనం (Mudiraj Simhavalokanam) కార్యక్రమంలో ఈటెల పాల్గొని మాట్లాడారు. పార్టీలు ఏవైనా జాతికి ఎప్పుడూ అండగా ఉంటామని సీరియస్ గా పోరాటం చేస్తే కచ్చితంగా అధికారం దక్కుతుందన్నారు. ఐక్య పోరాటం కోసం సిద్ధం కావాలని మన డిమాండ్స్ ఎందుకు నెరవేరవో చూద్దామని పిలుపునిచ్చారు. మనలాంటి జాతులందరినీ కలుపుకొని ముందుకు పోదామన్నారు.

ఒకటే సంఘంగా ఉండాలి అనేది మొదటి నుండి నా విజ్ఞప్తి అని ఎన్నో ఏళ్లుగా మన హక్కుల కోసం కొట్లాడుతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. రోషంలో, సాహసంలో కొదవలేదు కానీ మనం ఎక్కడ ఉన్నాము పునరాలోచన చేసుకోవాలన్నారు. బీసీడీ నుంచి బీసీ ఏ కి మార్చాలని మొదటిసారి అసెంబ్లీలో మాట్లాడింది నేనే నని ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అనేకసార్లు అసెంబ్లీలో ప్రస్తావించాననన్నారు. 2008 లో ఉప ఎన్నికల సందర్భంగా రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ అందినట్టే అంది దూరం అయ్యిందని గుర్తు చేశారు. మాది మాకు కావాలని మాత్రమే అడుగుతున్నామని ఈ జాతి అనేక సంవత్సరాలుగా అక్రోషిస్తోందన్నారు. బీసీ-డి నుండి బీసీ-ఏ అనే ప్రక్రియ ఒకసారి అమలు జరిగి ఆగిపోయింది కాబట్టి దానిని పరిశీలించి సంపూర్ణంగా అమలు చేయాలని ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నాన్నారు.

ఏ కులాన్ని, వర్గాన్ని ద్వేషించే వాళ్ళం కాదని ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకు సరైన వాటా దక్కాలని కోరుతున్నామన్నారు. జనాభా ఆధారంగా ఫలితాలు అందాలని సోయి పార్టీలకు ప్రభుత్వ పెద్దలకు ఉండాలన్నారు. పైసలు ఉన్నవారు ఎమ్మెల్యేలు ఎంపీలు కాగలుగుతున్నారు. గుడిసెలో ఉన్నవారికి, వంద కోట్ల బంగ్లాలో ఉన్నవారికైనా ఒకటే ఓటు అని సంబరపడటం కానీ ప్రజాసేవ చేసే అవకాశం అందరికీ రావడం లేదన్నారు. దీనిని పోగొట్టగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుందని ఇది సంఘాలకు మేధావులకు చైతన్యవంతులకు మాత్రమే ఉంటుందన్నారు. సంఘాలను కూడా పార్టీల ముద్ర వేసి నిర్వీర్యం చేస్తున్నారని పోరాడితే పోయేదేమీలేదు బానిస సంకెళ్లు తప్ప అనేది గుర్తుపెట్టుకుని మనందరం ఐక్యంగా పోరాడాలని ఈ క్రమంలో మనలాంటి జాతులందరినీ కలుపుకొని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు పార్టీలు ఏమైనా ఉండవచ్చు కానీ జాతి మనుగడ కోసం న్యాయమైన డిమాండ్ కోసం ముందు ఉండి పని చేస్తామని, MRPS ఉద్యమంలో నేను కూడా ఉన్నానని గుర్తు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande