విశాఖలో. డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ 13 కిలో మీటర్లకు కుదిస్తూ కేంద్రానికి సూచన
విశాఖలో. డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ 13 కిలో మీటర్లకు కుదిస్తూ కేంద్రానికి సూచన
విశాఖలో. డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ 13 కిలో మీటర్లకు కుదిస్తూ కేంద్రానికి సూచన


విశాఖ పట్నం, 26 మే (హి.స.)

విశాఖలో డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ 13 కిలోమీటర్లకు కుదిస్తూ రైట్స్ సంస్థ కేంద్రానికి సూచించింది. 20 కి.మీ. మేర నిర్మించాలని రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వే చేసిన రైౖట్స్ కన్సల్టెన్సీ గాజువాక నుంచి హనుమంతువాక వరకే (13 కి.మీ.) డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ చాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. విశాఖలో 140.13 కి.మీ. పొడవున మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టాలన్నది ప్రతిపాదన. మొదటి దశలో రూ.11,498 కోట్లతో 46.23 కి.మీ. మేర మెట్రో తీసుకురావాలని నిర్ణయించారు. ఈలోగా ట్రాఫిక్ నియంత్రణకు నగరం మధ్యలోని జాతీయ రహదారిలో లంకెలపాలెం నుంచి మధురవాడ ముందున్న కారు షెడ్డు వరకు పైవంతెన నిర్మిస్తున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రకటించింది. దీంతో మెట్రో రైల్ ప్రాజెక్టులో డబుల్ డెక్కర్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. స్టీల్ప్లాంట్ నుంచి గాజువాక వరకు 5 కి.మీ., తాటిచెట్లపాలెం నుంచి మధురవాడ వరకు 15 కి.మీ. కలిపి మొత్తం 20 కి.మీ. పొడవున డబుల్ డెక్కర్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. జాతీయ రహదారి మధ్యలో స్టీల్ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు మెట్రో కారిడార్ నిర్మించాలన్నది ప్రతిపాదన. ఈ విధానంతో భూసేకరణ అవసరం ఉండదు. ప్రాజెక్టు వ్యయం తగ్గుతుందన్నది ఆలోచన. ఎన్హెచ్ఏఐ నిర్మిస్తామన్న పైవంతెన పైన మెట్రో కారిడార్ వచ్చేలా డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ను రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ట్రాఫిక్ ఇబ్బందులతో మెట్రో రైల్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో ప్రతిపాదిత డబుల్ డెక్కర్ను కుదించాలని కేంద్రానికి రైట్స్ సంస్థ సిఫార్సు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande