
యాదాద్రి భువనగిరి, 26 మే (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లాలో
యాదగిరిగుట్ట, భువనగిరి, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో నిన్న సాయంత్రం నుండి రాత్రి వరకు పలుచోట్ల వర్షాలు పడ్డాయి. దీంతో కల్లాల వద్ద ధాన్యం తడిసిపోయింది. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రెండు నెలలు గడుస్తున్న ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేసి బస్తాల్లో నింపిన లారీల కొరత కారణంగా ఎగుమతి చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..