
హైదరాబాద్, 26 మే (హి.స.)
నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేట్
వేగంగా కొత్తచెరువు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. చెరువు పరిరక్షణలో భాగంగా చెరువు పరిధిలోకి వచ్చిన గోల్డ్ ఫిష్ విల్లాస్ ప్రహరీ గోడను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా హైడ్రా సిబ్బందితో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలంలో పర్యవేక్షణ చేశారు. చెరువు భూభాగం భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలకు గురి కాకుండా ఉండేందుకు చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులను అధికారులు ప్రారంభించారు. చెరువుల పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణ, ఆక్రమణల నివారణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు. స్థానికులు చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తూ, ఆక్రమణలపై మరింత కఠిన చర్యలు కొనసాగించాలని కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..