భారత క్రీడారంగంలో చారిత్రాత్మక సంస్కరణలు.. 'నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బోర్డు' ఏర్పాటు
భారత క్రీడారంగంలో చారిత్రాత్మక సంస్కరణలు.. 'నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బోర్డు' ఏర్పాటు
Sports


న్యూఢిల్లీ, 26 మే (హి.స.)

భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తీసుకుంది. భారత క్రీడారంగంలో చారిత్రాత్మక సంస్కరణలు (Historical reforms) చేస్తూ.. 'నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బోర్డు' ఏర్పాటు చేసింది. ఈ బోర్డు.. దేశంలోని జాతీయ క్రీడా సంస్థల (National Sports Bodies) ప్రక్షాళన, క్రీడా వివాదాల సత్వర పరిష్కారం కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ(Govt of India, Dept of Sports) సరికొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారిక గెజిట్ ను విడుదల చేసింది. దీంతో నేటి నుంచి 'నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బోర్డ్ రూల్స్, 2026' (NSB), 'నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ రూల్స్, 2026' (NST) అధికారికంగా అమలులోకి వచ్చాయి.

ఈ నూతన నిబంధనల ప్రకారం.. కొత్తగా ఏర్పాటయ్యే నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బోర్డ్ (NSB) ఇకపై దేశంలోని అన్ని జాతీయ క్రీడా సమాఖ్యల (ఫెడరేషన్ల) గుర్తింపు ప్రక్రియను, వాటి పాలనా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. దీనివల్ల క్రీడా సంస్థల్లో రాజకీయ జోక్యం తగ్గి, మేనేజ్మెంట్లో జవాబుదారీతనం రానుంది. మరోవైపు, క్రీడాకారులు, బోర్డుల మధ్య తలెత్తే అంతర్గత వివాదాలను వేగంగా, స్వతంత్రంగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించేందుకు నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ (NST) ఒక ప్రత్యేక న్యాయ వ్యవస్థలా పనిచేస్తుంది. దీనివల్ల క్రీడాకారులు కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా సకాలంలో న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande