
రాజన్న సిరిసిల్ల, 26 మే (హి.స.)
జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే ఆదేశాలతో సిరిసిల్ల వేములవాడ పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఏకకాలంలో వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున నుంచే సోదాలు చేస్తున్నారు. అధిక వడ్డీలు, డైలీ ఫైనాన్స్ లపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు