
రంగారెడ్డి, 26 మే (హి.స.)
కోహెడ భూ బాధతులకు రాష్ట్ర
ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి రైతులు, స్థానిక ప్రజలు సహకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదిభట్ల సర్కిల్ తొర్రూరు డివిజన్ పరిధిలోని కోహెడ సర్వేనెంబర్ 167/1 లో 239 ఎకరాల్లో నిర్మించే అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ పనులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మల్కాజిగిరి కమిషనర్ సుమతి, మార్కెట్ ఉన్నత శ్రేణి అధికారి శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఆర్డిఓ అనంతరెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, అడిషనల్ డీసీపీ కోటేశ్వర్, ఏసీపీ కాశిరెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ సుదర్శన్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం రెవెన్యూ మ్యాప్ ను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు.
రాకపోకలను ఇబ్బందులు తలెత్తకుండా రింగ్ రోడ్డు ఆనుకొని కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. సర్వేనెంబర్ 167/1 లో నష్ట పోయే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్నారు. ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి రైతులు, స్థానిక ప్రజలు సహకరించాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు