షార్ట్ టెండర్ల ద్వారా కాలువ మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ.నిర్ణయం
షార్ట్ టెండర్ల ద్వారా కాలువ మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ.నిర్ణయం
షార్ట్ టెండర్ల ద్వారా కాలువ మరమ్మత్తు  పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ.నిర్ణయం

అమరావతి, 26 మే (హి.స.)

షార్ట్ టెండర్ల ద్వారా కాలువ మరమ్మతు పనులను పూర్తి చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. రూ. పది లక్షల విలువైన పనులను నామినేషన్ పద్ధతిపై సాగునీటి సంఘాల సమాఖ్యలు చేస్తున్నాయి. రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువైన పనులు 6502 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ పనులను వానాకాలంలోగా పూర్తి చేయడం ద్వారా ప్రతి ఎకరాకూ నీరందించవచ్చని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈమేరకు షార్ట్టెండర్ (ఏడు రోజుల్లోపు టెండర్ ఖరారు చేసేవి) పిలిచి పనులు అప్పగించాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. షార్ట్టెండర్ల ద్వారా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్కుమార్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande