
సిద్దిపేట, 26 మే (హి.స.)
షాట్ సర్క్యూట్ కారణంగా
కార్యాలయంలోని కంప్యూటర్లు పేలి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం రోజువారీ మాదిరిగా కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పనుల్లో సిబ్బంది నిమగ్నమై ఉండగా షాట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా కంప్యూటర్ పేలి శబ్దం రావడంతో సిబ్బంది ఉలిక్కి పడ్డారు. షాట్ సర్క్యూట్ కారణంగా కార్యాలయంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కంప్యూటర్లు కాలిపోవడంతో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో ఆరు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాగా విద్యుత్ సరఫరాలో లోపాన్ని గుర్తించి రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తెస్తామని చేర్యాల ఎస్ ఆర్ ఓ మనోహర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు