
రుద్రవరం, 26 మే (హి.స.): చేపల పెంపకందారులు కొండమాయపల్లె చిన్నరాజచెరువు తూములను అనధికారరంగా ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో విలువైన నీరు వృథా అయి, గ్రామమంతా చిత్తడిగా మారింది. చేపలు పట్టుకోడానికే ఇలా చేసినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం చేపలను వలలు వేసి పట్టుకోవాలే ఆని ఇలా తూములు ఎత్తకూడదు. ముందే నీటి ఎద్దడి ఉండగా ఇలా వృథాచేయంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రెవెన్యూ, మైనర్ ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లా అధికారులు స్పందించి, నీటి వృథాను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV