సామాన్యుడిపై ఇంధన మోత.. పెట్రోల్, డీజిల్ బాటలోనే 'CNG' ధరల పెంపు
సామాన్యుడిపై ఇంధన మోత.. పెట్రోల్, డీజిల్ బాటలోనే 'CNG' ధరల పెంపు
/fuel-companies-increase-cng-price-by-rs-2-


కర్నూలు, 26 మే (హి.స.) అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో ఇంధన సంస్థలు రేట్లను పెంచుతూ సామాన్యులపై భారం వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం వెలువడ్డ ప్రకటన వాహనదారులపై మరింత భారంగా మారుతోంది. నిన్ననే (సోమవారం) చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిన చేదు వార్తను మరవకముందే.. నేడు సామాన్యుడిపై మరో ఇంధన వడ్డన పడింది. దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను మరోసారి పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ప్రకటనలో కేజీ సీఎన్జీ ధరపై రూ. 2 పెంచారు. గత 12 రోజుల్లో CNG ధరలు పెరగడం ఇది నాలుగోసారి.

మే 15 నుంచి ఇప్పటివరకు కిలో CNGపై ₹6 పెరిగాయి. దీంతో TGలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండలో కిలో సీఎన్జీ ₹102గా ఉంది. ఏపీలోని విశాఖలో ₹91.17, విజయవాడలో ₹96, ఒంగోలులో ₹103.90 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు సరఫరా వ్యయాలు పెరగడం, గత కొన్ని రోజులుగా ముడిచమురు మార్కెట్లో నెలకొన్న తీవ్ర అస్థిరత కారణంగానే దేశీయంగా చమురు సంస్థలు ఈ మేర ధరలను సవరించినట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల ఇప్పటికే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు పెరుగుతుండగా.. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్న సీఎన్జీ ధర కూడా పెరగడం ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, మధ్యతరగతి వాహనదారులకు పెద్ద దెబ్బగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande