
శ్రీసత్యసాయి, 26 మే (హి.స.)
శ్రీసత్యసాయి జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటం, నేరాలను పూర్తిగా అరికట్టడం లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, నేర చరిత్ర గల వ్యక్తులు, సస్పెక్ట్ షీటర్లకు విస్తృతంగా కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు స్పష్టంగా హెచ్చరించారు. నేర ప్రవర్తనను వెంటనే విడనాడి, సత్ప్రవర్తనతో జీవనం సాగించాలని సూచించారు.
ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే, ఇప్పటికే ఉన్న కేసులకు అదనంగా మరిన్ని క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి.హెచ్చరించారు.జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ప్రతి అనుమానాస్పద చర్యను పోలీసులు సమీక్షిస్తున్నారని తెలిపారు.
రౌడీషీటర్లకు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ.. వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కోరారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాన్బెయిలబుల్ వారెంట్ల అమలును వేగవంతం చేయాలన్నారు. పోక్సో, మహిళలపై జరిగే నేరాలపై అప్రమత్తంగా ఉండడంతో పాటు వారికి న్యాయం చేకూరే విధంగా చర్యలు తీ సుకోవాలని స్ప ష్టం చేశారు. గంజాయి, దొం గతనాల కేసుల దర్యాప్తు వేగ వంతంగా పూ ర్తి చేయాలని, దొంగ తనానికి గు రైన ఆస్తులను రికవరీ చేయాలని ఆదే శించారు. సబ్ డివి జన్లో నేర నియంత్రణకు పటి ష్ఠంగా కృషి చే యాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV