ఘోర ప్రమాదం.. పొలంలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ఘోర ప్రమాదం.. పొలంలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
acc


అనంతపురం , 26 మే (హి.స.)

రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలో జాతీయ రహదారి 44పై మంగళవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టి, పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సుపై కంట్రోల్ కోల్పోవడంతో.. మూడు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులుండగా.. 15 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.

ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే గుత్తి పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. గాయపడినవారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండగా.. వారికి మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బస్సు వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం, వాహన ఫిట్నెస్ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. రాత్రివేళల్లో లాంగ్ రూట్ బస్సుల్లో డ్రైవర్ అలసట, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతుండటం ప్రయాణికుల్లో ఆందోళన రేపుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande