
అమరావతి, 27 మే (హి.స.)
రోడ్లు భవనాల శాఖలో ఇన్చార్జి ఇంజనీరింగ్ చీఫ్ (ఈఎన్సీ)గా ఎల్. శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రధాన రహదారులు (స్టేట్ హైవేస్) చీఫ్ ఇంజనీర్గా, ఆంధ్రప్రదేశ్ రహదారి అభివృద్ధి సంస్థ (ఏపీఆర్డీసీ) ఎండీగా పనిచేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ