
గాజువాక, 27 మే (హి.స.) అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గాజువాక పోలీసుస్టేషన్ పరిధిలోని గోపాలరెడ్డినగర్లో బుధవారం జరిగింది. దీనిపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నమ్మి గణేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరానికి చెందిన లావణ్య(30)కు కశింకోటకు చెందిన బుడ్డిన నవీన్తో 2020 మార్చిలో వివాహమైంది. నవీన్ విశాఖ రిలయన్స్ మార్ట్లో సూపర్వైజర్గా పని చేస్తుండటంతో గోపాలరెడ్డినగర్లో ఉంటున్నారు. అయితే అదనపు కట్నం కోసం లావణ్యను భర్త, అత్తంటివారు తరచూ వేధించేవారు. ఇటీవల ఇరువర్గాల పెద్దలు కూడా జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. ఏమైందో ఏమో మంగళవారం తెల్లవారుజామున లావణ్య ఇంట్లో ఉరి వేసుకొంది. భర్త నవీన్, అత్తకుమారి, మరిది తరుణ్ వేధింపుల వల్లే తమ కుమార్తె చనిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ